మాది రివెంజ్‌ ఎంటర్‌టైనర్‌

Nani new movie Gang Leader press meet - Sakshi

– నాని

‘‘రెండు ఐకానిక్‌ సినిమాల (సాహో, సైరా: నరసింహారెడ్డి చిత్రాలను ఉద్దేశించి) మధ్య వస్తున్నాం. ఆ రెండు సినిమాలకు మా చిత్రానికి రిలీజ్‌ల విషయంలో గ్యాప్‌ ఉంది కాబట్టి పెద్దగా టెన్షన్‌ లేదు. నేను కూడా ఆ సినిమాలను చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని నాని అన్నారు. విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌’. ౖమైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేనీ, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 13న విడుదల కానుంది.

ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు నాని వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ– ‘‘మంచి పాజిటివ్‌ ఎనర్జీతో ఈ సినిమా స్టార్ట్‌ చేశాం. చాలా ఎంజాయ్‌ చేస్తూ షూటింగ్‌ను కంప్లీట్‌ చేశాం. టీమ్‌ మెంబర్స్‌ నా బరువునంత పంచుకున్నారు. లక్ష్మి, శరణ్యగార్లతో నటించడం అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఇది మాకు ఒక హ్యాపీ ప్రాజెక్ట్‌. వచ్చే బుధవారం ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం. సినిమాలో సర్‌ప్రైజ్‌లు, నవ్వులు ఉంటాయి. వచ్చే నెల మొదటి వారంలో నేను–అనిరు«ద్‌ చేసిన ఓ ప్రమోషనల్‌ సాంగ్‌ వీడియో రిలీజ్‌ ప్లాన్‌ ఉంది.

ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు ప్రియాంక. చిరంజీవిగారి ‘గ్యాంగ్‌లీడర్‌’ మంచి ఐకానిక్‌ మూవీ. ఆ సినిమా జానర్‌ వేరు. మా సినిమా రివెంజ్‌ ఎంటర్‌టైనర్‌. ఇందులో దేవ్‌ అనే విలన్‌ పాత్రలో కార్తికేయ చాలా బాగా చేశాడు. మైత్రీ నిర్మాతలు సినిమాలను చాలా క్వాలిటీగా తీస్తారు’’ అన్నారు. ‘‘యాక్టర్‌గా నాకు తక్కువ అనుభవం ఉన్నప్పటికీ ఈ సినిమాలోని దేవ్‌ పాత్ర నాకు ఇచ్చిన నాని, విక్రమ్‌గార్లకు థ్యాంక్స్‌. హీరో అవ్వాలనుకునే మాలాంటి వారికి నానిగారు ఒక ప్రేరణ. నా రోల్‌ భయపెట్టేలా ఉంటుంది’’ అన్నారు కార్తికేయ. ‘‘ఈ చిత్రం నాకు తెలుగులో తొలి సినిమా. నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు. మంచి డెబ్యూ మూవీ దొరికింది’’ అన్నారు ప్రియాంక.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top