ట్రోలింగ్‌: దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చిన నమ్రత

Namrata Shirodkar Slams Troll Who Comment On Her Pic With Mahesh Babu - Sakshi

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మహర్షి సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 24.6 కోట్ల షేర్‌ సాధించింది. ఈ క్రమంలో మహర్షి సినిమా విజయాన్ని ఎంజాయ్‌ చేస్తూ మహేష్‌ బాబు- డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి కుటుంబాలు పార్టీ చేసుకున్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలను మహేష్‌ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  ‘ సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ఫుల్‌ మూవీ మహర్షి. ఇంతటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన వంశీ పైడిపల్లికి ధన్యవాదాలు. వాట్‌  ఏ నైట్‌’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పోస్ట్‌ చేశారు.  దీంతో మహర్షి తప్పక చూడాల్సిన సినిమా అంటూ మహేష్‌ అభిమానులు కామెంట్‌ చేస్తుండగా.. ఓ నెటిజన్‌ మాత్రం ఈ ఫొటోల్లో నమ్రత లుక్‌ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశాడు.

‘నమ్రత నువ్వెందుకు కొంచెం అయినా మేకప్‌ వేసుకోవు. ఏదైనా ఫోబియాతో బాధ పడుతున్నావా లేదా డిప్రెషన్‌లో ఉన్నావా’ అని ట్రోల్‌ చేశాడు. ఇందుకు స్పందనగా..‘ గౌరవ్‌ మేకప్‌ వేసుకున్న మహిళలనే నువ్వు ప్రేమిస్తావనుకుంటా. ఇకపై ఆలోచనా సరళికి సరిపోయే వాళ్లనే ఫాలో అవ్వు ఓకేనా. అలా అయితేనే ఇలాంటివి చూడకుండా ఉండగలవు!!! కాబట్టి ఇక్కడి నుంచి నువ్వు వెళ్లిపోవచ్చు. నా సిన్సియర్‌ రిక్వెస్ట్‌ ఇది’ అంటూ దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చారు. దీంతో అందం అనేది మనసుకే తప్ప శరీరానికి కాదు. మహేష్‌ ఇప్పటికీ 25 ఏళ్ల యువకుడిలా కనిపించడం వెనుక మీ శ్రమ ఉంది. గౌతం, సితారాల పెంపకంలో మీ పాత్ర అమోఘం. అయినా మేకప్‌ వేసుకున్నంత మాత్రాన అందంగా ఉన్నారనడం అవివేకం. అతడికి మంచి కౌంటర్‌ ఇచ్చారు మేడమ్‌’ అని నెటిజన్లు నమ్రతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా 1993లో మిస్‌ ఇండియా కిరీటం దక్కించుకున్న నమ్రత బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత వంశీ సినిమాలో తనతో కలిసి నటించిన మహేష్‌ బాబును ప్రేమించిన ఆమె.. 2005లో అతడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top