షిఫ్ట్‌ టు ముంబై! | nagarjuna movie shooting in mumbai | Sakshi
Sakshi News home page

షిఫ్ట్‌ టు ముంబై!

Jan 22 2018 1:33 AM | Updated on Jul 15 2019 9:21 PM

nagarjuna movie shooting in mumbai - Sakshi

సైలెంట్‌గా ఇన్వెస్టిగేషన్‌ చేస్తూ స్పీడ్‌గా దూసుకెళ్తున్నారు హీరో నాగార్జున. ఆ ఇన్వెస్టిగేషన్‌ ప్రోగ్రెస్‌ ఎంతవరకు వచ్చిందంటే.. జస్ట్‌ హైదరాబాద్‌ నుంచి ముంబైకి షిఫ్ట్‌ అయ్యింది. నాగార్జున హీరోగా కంపెనీ పతాంకపై సుధీర్‌ చంద్రతో కలిసి రామ్‌గోపాల్‌ వర్మ స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మైరా సరీన్‌ ఫిమేల్‌ లీడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు. నాగార్జున పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. శనివారం వరకు చిత్రీకరించిన కీలక సన్నివేశాలతో హైదరాబాద్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ అయ్యిందట. ముంబైలో నెక్ట్స్‌ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారని సమాచారం.

ఆల్మోస్ట్‌ పదిహేను రోజుల పాటు సాగే ఈ ముంబై షెడ్యూల్‌ ఈ నెల 26న స్టార్ట్‌ అవుతుందని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. అంతే కాదండోయ్‌.. ఫిబ్రవరి ఎండ్‌ కల్లా ఎంటైర్‌ షూటింగ్‌కి ప్యాకప్‌ చెప్పాలనే ఆలోచనలో ఉన్నారట వర్మ అండ్‌ టీమ్‌. ఈ సినిమాకు ‘శపథం’(రివెంజ్‌ కంప్లీట్స్‌ అన్నది ఉపశీర్షిక) అనే టైటిల్‌ను ఫైనలైజ్‌ చేయాలని చిత్రబృందం ఆలోచిస్తున్నారని వినికిడి. ఈ సినిమాను ఏప్రిల్‌లో విడుదల చేయనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. నాగార్జున తనయుడు అఖిల్‌తో కలిసి రామ్‌గోపాల్‌ వర్మ ఓ షార్ట్‌ ఫిల్మ్‌ను ప్లాన్‌ చేశారట. ‘హలో’ తర్వాత అఖిల్‌ చేయబోయే సినిమా గురించి ఇంకా అధికారిక ప్రకటన రాని విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement