’నావాడు హాట్గా కాదు.. నైస్గా ఉండాలి’ | My man has to be nice, not hot: Alia | Sakshi
Sakshi News home page

’నావాడు హాట్గా కాదు.. నైస్గా ఉండాలి’

Nov 15 2016 1:47 PM | Updated on Apr 3 2019 9:04 PM

’నావాడు హాట్గా కాదు.. నైస్గా ఉండాలి’ - Sakshi

’నావాడు హాట్గా కాదు.. నైస్గా ఉండాలి’

తనకు కాబోయే వాడు యూత్ ఐకాన్ అవ్వాల్సిన పనిలేదని, మనసులు దోచుకునేవాడు కావాల్సినవసరం లేదని ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ చెప్పింది.

ముంబయి: తనకు కాబోయే వాడు యూత్ ఐకాన్ అవ్వాల్సిన పనిలేదని, మనసులు దోచుకునేవాడు కావాల్సినవసరం లేదని ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్ చెప్పింది. అయితే, అతడు మంచి లక్షణాలు కలిగి ఉండాలని, మంచి మనసున్నవాడై ఉండాలని చెప్పింది.

’నా జీవితంలో భాగస్వామి వచ్చినప్పుడు అతడు యూత్ ఐకాన్ అవ్వాల్సిన పనిలేదు.. అతడు హాట్ గా ఉన్నాడా లేదా అని కాదు.. మంచి మనసున్న వాడైతే చాలు. చాలా ఫన్నీగా ఉండాలి. బాధ్యతతో ఉండాలి. నన్ను బాగా ప్రేమించాలి’  అని చెప్పింది. ఈ ఏడాది ఆమె నటించిన ఉడ్తా పంజాబ్, కపూర్ అండ్ సన్స్ చిత్రాలకు అవార్డులు వస్తాయా అని ప్రశ్నించగా ఇంకా ఏడాది పూర్తవలేదుగా.. చూద్దాం ఏం జరుగుతుందో. నేను అవార్డులు రివార్డులు ప్రేక్షకుల నుంచి కోరుకుంటాను. వారు డియర్ జిందగీ సినిమాకు వచ్చి ఆ చిత్రాన్ని ఇష్టపడతారని కోరుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement