లాయర్‌ మంజిమా | manjima mohan new movie fir first look launch | Sakshi
Sakshi News home page

లాయర్‌ మంజిమా

Jul 21 2019 6:19 AM | Updated on Jul 21 2019 6:19 AM

manjima mohan new movie fir first look launch - Sakshi

మంజిమా మోహన్‌

ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్స్‌ను తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారు కథానాయిక మంజిమా మోహన్‌. కోర్టులో లాయర్‌గా వాదించనున్నారు. ‘ఎఫ్‌.ఐ.ఆర్‌’ (ఫైజల్‌ ఇబ్రహీమ్‌ రైజ్‌) అనే సినిమాలో ఆమె లాయర్‌గా కనిపించనున్నారు. మను ఆనంద్‌ దర్శకత్వంలో విష్ణు విశాల్‌ హీరోగా ఈ తమిళ చిత్రం  తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. అనుకోని పరిస్థితుల కారణంగా పోలీసుల చేతిలో చిక్కిన ఓ ముస్లిం యువకుడి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. జూనియర్‌ అడ్వకేట్‌గా మంజిమా నటిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. తెలుగులో నాగచైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’  చిత్రంలో మంజిమా మోహన్‌ కథానాయికగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement