మంచు విష్ణుతో 'మేడ మీద అబ్బాయి' | Manchu Vishnu next movie based on Meda meeda abbayi Novel | Sakshi
Sakshi News home page

మంచు విష్ణుతో 'మేడ మీద అబ్బాయి'

Feb 2 2017 3:40 PM | Updated on Sep 5 2017 2:44 AM

మంచు విష్ణుతో 'మేడ మీద అబ్బాయి'

మంచు విష్ణుతో 'మేడ మీద అబ్బాయి'

ఇటీవల లక్కున్నోడు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మంచు వారబ్బాయి కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు.

ఇటీవల లక్కున్నోడు సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మంచు వారబ్బాయి కామెడీ టైమింగ్తో ఆకట్టుకున్నాడు. అదే జోరులో మరిన్ని సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే రెండు మూడు ప్రాజెక్ట్ చేతిలో ఉన్న విష్ణు ఇప్పుడు మరో సినిమాను కూడా లైన్లో పెట్టాడు. తన మార్క్ కామెడీ టచ్తో తెరకెక్కనున్న ఈ సినిమా ఓ ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్తో తెరకెక్కుతోంది.

రాజ్ తరుణ్ హీరోగా 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' సినిమాను తెరకెక్కించిన గవిరెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు ఓ సినిమాను అంగీకరించాడు. మేడ మీద అబ్బాయి నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అయితే ఈ టైటిల్తో అల్లరి నరేష్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు. మరి అదే ప్రాజెక్ట్ ఇప్పుడు విష్ణు చేతికి వచ్చిందా..? లేక టైటిల్ ఒకరు, కాన్సెప్ట్ ఒకరు తీసుకున్నారా..? తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement