లవ్.. కామెడీ.. యాక్షన్ | manchu manoj and s.k.sathya new movie confirmed | Sakshi
Sakshi News home page

లవ్.. కామెడీ.. యాక్షన్

Jul 31 2016 12:23 AM | Updated on Sep 4 2017 7:04 AM

లవ్.. కామెడీ.. యాక్షన్

లవ్.. కామెడీ.. యాక్షన్

మంచు మనోజ్ కొత్త చిత్రం అంగీకరించారు. ‘నా రాకుమారుడు’ ఫేమ్ ఎస్.కె.సత్య చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారాయన...

మంచు మనోజ్ కొత్త చిత్రం అంగీకరించారు. ‘నా రాకుమారుడు’ ఫేమ్ ఎస్.కె.సత్య చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారాయన. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రాన్ని క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వరుణ్ అట్లూరి నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. దర్శకుడు సత్య మాట్లాడుతూ -‘‘మనోజ్ క్యారెక్టరైజేషన్ సినిమాకి హైలైట్. లవ్, కామెడీలతో కూడిన మాస్ ఎంటర్‌టైనర్ చిత్రమిది’’ అన్నారు. త్వరలో కథానాయికని ఎంపిక చేసి, చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. రాజేంద్రప్రసాద్, సంపత్ కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి కెమేరా: సిద్దార్ధ రామస్వామి, సంగీతం: శ్రీ వసంత్.

Advertisement
 
Advertisement
Advertisement