
కేటీఆర్, మమ్ముట్టి
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి శుక్రవారం క్యాంప్ ఆఫీసులో పంచాయతీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ భేటీ సందర్భంగా మమ్ముటీ ఈ నెల 25న
సాక్షి, హైదరాబాద్ : మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి శుక్రవారం క్యాంప్ ఆఫీసులో పంచాయతీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ భేటీ సందర్భంగా మమ్ముటీ ఈ నెల 25న హైదరాబాద్‌లో జరిగే ‘కైరాలి పీపుల్ ఇన్నోటెక్ అవార్డ్స్’ కార్యక్రమానికి కేటీఆర్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ విషయాన్ని కేటీఆర్ ట్విటర్‌లో తెలిపారు
కాగా మమ్ముట్టి ... మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘యాత్ర’ చిత్రంలో వైఎస్సార్ పాత్ర పోషిస్తున్నారు. ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే వైఎస్సార్ జయంతి సందర్భంగా చిత్ర యూనిట్ టీజర్ విడుదల చేయగా.. వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి ఒదిగిపోవడంతో విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది.
Malayalam Film Actor Mammootty met Minister @KTRTRS at Camp office today. The veteran actor invited Minister to be the Chief Guest at the ‘Kairali People Innotech Awards’ function which will take place on 25th July, 2018 in Hyderabad. pic.twitter.com/zYYOvv4Xpx
— Min IT, Telangana (@MinIT_Telangana) July 20, 2018