స్నేహితులతో చిందులేసిన మలైకా | Malaika Arora Dance at Early Christmas Bash With Girl Gang | Sakshi
Sakshi News home page

స్నేహితులతో చిందులేసిన మలైకా

Dec 23 2019 4:32 PM | Updated on Dec 23 2019 4:54 PM

Malaika Arora Dance at Early Christmas Bash With Girl Gang - Sakshi

ముంబై : ఇటీవలే అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని సందర్శించిన బాలీవుడ్‌ హీరోయిన్‌ మలైకా అరోరా ఖాన్‌.. 46 సంవత్సరాల వయస్సులోనూ తన అందచందాలతో అభిమానులను మత్తెక్కిస్తున్నారు. అంత్యంత సన్నిహితులు మలైకాను ‘మల్లా’అని ముద్దుగా పిలుచుకుంటారన్న విషయం తెలిసిందే. సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మలైకా నిత్యం ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తారు. తాజాగా తన డాన్స్‌తో మళ్లీ తెరమీదకు వచ్చారు ఈ బీ-టౌన్‌ బ్యూటీ. 

త్వరలో రానున్న క్రిస్మస్‌ సందర్భంగా తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపారు. క్రిస్మస్‌కు ముందే ఏర్పాటు చేసిన పార్టీలో అమ్మాయిల గ్యాంగ్‌తో కలిసి కాసేపు చిందులేశారు. రెడ్‌ కలర్‌ డ్రెస్‌లో ఆడి పాడి అదరగొట్టారు. కాగా ఈ గ్యాంగ్‌లో మిత్రురాలు సీమ ఖాన్‌, సోదరి అమిత్ర అరోరాతో పాటు మరికొంత మందితో మలైకా ఎంజాయ్‌ చేశారు. మలైకా ఫ్యాన్‌ క్లబ్‌ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ఇక భర్తతో విడిపోయిన మలైకా ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్‌ అర్జున్‌ కపూర్‌తో ప్రేమ వ్యవహారంలో ఉన్న విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement