ప్రతీకార కథతో..

maheshinte prathikaram remake venkatesh maha - Sakshi

మొదటి సినిమా ‘కేరాఫ్‌ కంచరపాలెం’లో ప్రేమనే ఇతివృత్తంగా, మూడు దశల్లో ప్రేమకథలను చూపించారు దర్శకుడు వెంకటేశ్‌ మహా. ఇప్పుడు తన కొత్త సినిమాను ప్రతీకార ఛాయలున్న కథతో రూపొందిస్తున్నారట. మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘మహేషింటె ప్రతీకారం’ చిత్రానికి ఈ సినిమా రీమేక్‌ అని తెలిసింది. ‘మహేషింటె ప్రతీకారం’లో చిత్రం ఫాహద్‌ ఫాజల్‌ ముఖ్యపాత్ర చేశారు. తెలుగు రీమేక్‌లో ఆయన పాత్రను సత్యదేవ్‌ చేస్తున్నారు. నవంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని సమాచారం. ‘మహేషింటె ప్రతీకారం’ సినిమాకి జాతీయ అవార్డు లభించింది. తమిళంలో ఈ సినిమాను దర్శకుడు ప్రియదర్శన్‌ రీమేక్‌ చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top