రాముడా... కృష్ణుడా..! | Mahesh Babu's Krishna Mukunda Murari with Vamsi Paidipalli | Sakshi
Sakshi News home page

రాముడా... కృష్ణుడా..!

Oct 23 2017 12:25 AM | Updated on Oct 23 2017 4:03 AM

Mahesh Babu's Krishna Mukunda Murari with Vamsi Paidipalli

రాముడిలా యుద్ధనీతి పాటించి శత్రువులను గెలుస్తాడా? లేక కృష్ణుడిలా మాయ చేసి విజయం సాధిస్తాడా? ఇంతకీ మహేశ్‌బాబు రాముడా..! కృష్ణుడా..! ఇదిగో... ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో మహేశ్‌ సినిమా టైటిల్‌ గురించి  ఇలాంటి చర్చే జరుగుతోంది. ‘బృందావనం’, ‘ఊపిరి’ వంటి హిట్‌ సినిమాలను డైరెక్ట్‌ చేసిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘కృష్ణాముకుందా మురారి’, ‘హరేరామ హరేకృష్ణ’  అనే టైటిల్స్‌ను అనుకుంటున్నారట.

అయితే మహేశ్‌బాబు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా రిలీజ్‌ కాకముందు నుంచే మహేశ్‌బాబు–వంశీ కాంబోకి ‘కృష్ణాముకుందా మురారి’ టైటిల్‌ రిజిస్టర్‌ అయ్యిందన్న వార్తలు ఉన్నాయి. అంతేకాకుండా ‘మురారి’ సినిమా మహేశ్‌ కెరీర్‌లో హిట్‌ చిత్రంగా నిలిచింది. సో... ఈ రెండింటి ప్రకారం ‘కృష్ణాముకుందా మురారి’ టైటిల్‌నే ఫిక్స్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఫిల్మ్‌నగర్‌ వాసులు. అధికారిక ప్రకటన వచ్చే లోపు ఇంకెన్ని టైటిల్స్‌ సీన్లోకొస్తాయో చూడాలి. మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన లొకేషన్లను సెట్‌ చేసేందుకు డైరెక్టర్‌ వంశీ యూఎస్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. లొకేషన్స్‌ని ఫైనలైజ్‌ చేసిన తర్వాత డైరెక్టర్‌ వంశీ, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవి శ్రీప్రసాద్, నిర్మాత ‘దిల్‌’రాజు మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ మొదలుపెడతారట.. ఈ సినిమా షూటింగ్‌ను వచ్చే ఏడాది స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement