లేడీ హరిశ్చంద్ర | Lady Harishchandra | Sakshi
Sakshi News home page

లేడీ హరిశ్చంద్ర

Nov 12 2016 10:58 PM | Updated on Sep 4 2017 7:55 PM

లేడీ హరిశ్చంద్ర

లేడీ హరిశ్చంద్ర

సినిమాల్లో లేడీ గెటప్‌లు వేసిన పురుషుల్ని చూశాం. కానీ, ఒక స్త్రీ తెరపై పురుష పాత్రలో కనిపిస్తే?

సినిమాల్లో లేడీ గెటప్‌లు వేసిన పురుషుల్ని చూశాం. కానీ, ఒక స్త్రీ తెరపై పురుష పాత్రలో కనిపిస్తే? నాటకరంగంలో తరచూ జరిగే ఈ ప్రయోగం ఇప్పుడు తెలుగు తెరపైకొచ్చింది. ప్రముఖ రంగస్థల నటి మంగాదేవి టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘సత్య హరిశ్చంద్ర’. వై.గోపాలరావు దర్శకత్వంలో కొత్తపల్లి సీతారాము నిర్మించిన ఈ చిత్రానికి వీణాపాణి శ్రీనివాస్ సంగీత దర్శకులు. శనివారం పాటల్ని విడుదల చేశారు.

‘‘సత్య హరిశ్చంద్ర పద్య నాటకానికి వెండితెర రూపమిది. డిసెంబర్‌లో రిలీజ్’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ‘‘నేను హరి శ్చంద్ర పాత్ర చేయాలన్నది మా నాన్నగారి కోరిక. ఆయన ప్రోత్సాహంతో రంగ స్థలంపై చాలాసార్లు ఈ పాత్ర చేశా’’ అన్నారు మంగాదేవి. దర్శకులు కోడి రామ కృష్ణ, నటులు జయప్రకాశ్, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement