ఇంకా ఉన్నాయి! | krishna vamsi's nakshatram first look released | Sakshi
Sakshi News home page

ఇంకా ఉన్నాయి!

Oct 10 2016 11:03 PM | Updated on Sep 4 2017 4:54 PM

ఇంకా ఉన్నాయి!

ఇంకా ఉన్నాయి!

కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘నక్షత్రం’ ఫస్ట్ లుక్‌ను విజయదశమి సందర్భంగా హీరో రామ్‌చరణ్ విడుదల చేశారు.

కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘నక్షత్రం’ ఫస్ట్ లుక్‌ను విజయదశమి సందర్భంగా హీరో రామ్‌చరణ్ విడుదల చేశారు. ఓ హ్యాండ్.. ఆ హ్యాండ్‌కి పోలీస్ బ్యాండ్.. లుక్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించిన కృష్ణవంశీ.. ఇలాంటి లుక్స్ ఇంకా ఉన్నాయంటున్నారు.

ప్రతిరోజూ ఒక్కో లుక్ చొప్పున మరో తొమ్మిది రోజుల పాటు డిఫరెంట్ లుక్స్‌ను రామ్‌చరణ్ విడుదల చేయనున్నారు. సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైశ్వాల్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. కె. శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్, సజ్జు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement