మన్మథుడితో ‘మహానటి’

Keerthy Suresh Join With Nagarjuna For Manmadhudu 2 Movie - Sakshi

కింగ్‌ నాగార్జున ‘మన్మథుడు’ చిత్రంలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. మళ్లీ అదే స్టైల్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించడానికి యంగ్‌ డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ ‘మన్మథుడు-2’ చిత్రాన్ని నాగార్జునతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోర్చుగల్‌ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాల్ని షూట్‌ చేసింది చిత్రయూనిట్‌.

పోర్చుగల్‌ షెడ్యూల్‌లో రకుల్‌ప్రీత్‌-నాగార్జునపై సీన్స్‌ను తెరకెక్కించగా.. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లో కీర్తి సురేష్‌ జాయిన్‌ అయింది. తాజాగా వీరిద్దరిపై రొమాంటిక్‌ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్‌ లోకేషన్‌లోని ఓ పిక్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. సమంత కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌ సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top