‘అందుకే ఆ సినిమా వదులుకున్నా’ | Kangana Ranaut Reveals Why She Opts Out of Anurag Basu Movie | Sakshi
Sakshi News home page

భవిష్యత్తులో కలిసి పనిచేస్తాం : కంగనా

Apr 3 2019 2:22 PM | Updated on Apr 3 2019 2:23 PM

Kangana Ranaut Reveals Why She Opts Out of Anurag Basu Movie - Sakshi

మేము భవిష్యత్తులో కచ్చితంగా కలిసి పనిచేస్తాం.

ముంబై : బాలీవుడ్ ‘క్వీన్‌’, ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌.. తనకు తొలి అవకాశం ఇచ్చిన అనురాగ్‌ బసుకు షాక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన దర్శకత్వంలో తెరకెక్కనున్న ఇమాలి మూవీ నుంచి తప్పుకొంటున్నట్లు పేర్కొన్న కంగన.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రకాశ్‌ కోవెలమూడి- ‘మెంటల్‌ హై క్యా’, అశ్వినీ అయ్యర్‌- పంగా సినిమాలతో పాటుగా జయలలిత బయెపిక్‌లో నటిస్తున్నారు. ఈ క్రమంలో గ్యాంగ్‌స్టర్‌ సినిమాతో తనను వెండితెరకు పరిచయం చేసిన..అనురాగ్‌ మూవీ నుంచి తప్పుకోవడానికి గల కారణాలు కంగన వెల్లడించారు.

‘గతేడాది పంగా, ఇమాలీ సినిమాలు చేస్తున్నట్లు ప్రకటించాను. అనురాగ్‌ బసు రూపొందించాల్సిన ఇమాలీ 2018లోనే సెట్స్‌పైకి రావాల్సింది. కానీ అప్పుడు నేను మణికర్ణిక రీషూట్‌ కారణంగా దర్శకత్వ బాధ్యతల్లో మునిగిపోయాను. భవిష్యత్తులో కూడా డైరెక్టర్‌గా రాణించాలనుకుంటున్నా. అందుకే ఈ సినిమా నుంచి తప్పుకొన్నా. ఈ నిర్ణయం కారణంగా ఎంతో బాధపడ్డాను. అయితే నా పరిస్థితిని.. నా మెంటార్‌ అనురాగ్‌ బసు అర్థం చేసుకున్నారు. మేము భవిష్యత్తులో కచ్చితంగా కలిసి పనిచేస్తాం’  అని కంగన చెప్పుకొచ్చారు. అదే విధంగా తన దర్శకత్వంలో తెరకెక్కిన మణికర్ణిక అద్భుత విజయం సాధించడంతో మహిళా సాధికారతపై మరిన్ని సినిమాలు తీయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇక మణికర్ణిక సినిమా కారణంగా టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌, కంగనాల మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement