రాళ్ల వెనుక దుస్తులు మార్చుకున్నా: హీరోయిన్ | Kangana changed clothes behind rocks for 'Rangoon' | Sakshi
Sakshi News home page

రాళ్ల వెనుక దుస్తులు మార్చుకున్నా: హీరోయిన్

Oct 24 2016 7:02 PM | Updated on Sep 4 2017 6:11 PM

రాళ్ల వెనుక దుస్తులు మార్చుకున్నా: హీరోయిన్

రాళ్ల వెనుక దుస్తులు మార్చుకున్నా: హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్కు సినిమా షూటింగ్లో ఓ సమస్య ఏర్పడిందట.

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్కు సినిమా షూటింగ్లో ఓ సమస్య ఏర్పడిందట. తగిన వసతులు లేకపోవడంతో రాళ్ల మాటున దుస్తులు మార్చుకోవాల్సి వచ్చిందని కంగన చెప్పింది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తున్న రంగూన్ సినిమా షూటింగ్ స్పాట్లో ఆమెకు ఈ సమస్య వచ్చింది. మరో హీరోయిన్ నేహా దూపియా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నో ఫిల్టర్ నేహా షోలో కంగనా ఈ విషయం చెప్పింది.

తన సినిమాల షూటింగ్ సందర్భంగా తాను ఎదుర్కొన్న సమస్యలను కంగన ఈ షోలో వెల్లడించింది. క్వీన్ సినిమా షూటింగ్ సందర్భంగా యూరప్లో తాను కేఫ్లలో దుస్తులు మార్చుకున్నానని చెప్పింది. రంగూన్ సినిమా షూటింగ్ సందర్భంగా అరుణాచల్ ప్రదేశ్లో ఇలాంటి సమస్యే ఎదురైందని కంగన తెలిపింది. అరుణాచల్ ప్రదేశ్లో మారుమూల లోయ ప్రాంతాల్లో రంగూన్ సినిమా షూటింగ్ చేశారని.. అక్కడ గ్రామాలు కానీ, విశ్రాంతి గదులు కానీ లేవని.. దీంతో తాను రాళ్ల మధ్యకు వెళ్లి దుస్తులు మార్చుకునేదాన్నని చెప్పింది. మనం ఎంచుకునే ప్రాజెక్టులను బట్టి ఇలాంటి సమస్యలు ఉంటాయని, స్టారయినా, సాధారణ ఆర్టిస్టు అయినా ఇలాంటి ఇబ్బందులు తప్పవని కంగన తన షూటింగ్ విశేషాలు చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement