రామ్‌చరణ్‌తో కాజల్ అగర్వాల్ ముచ్చటగా మూడోసారి పనిచేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘మగధీర’,

రామ్‌చరణ్‌తో కాజల్ అగర్వాల్ ముచ్చటగా మూడోసారి పనిచేయబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘మగధీర’, ‘నాయక్’ ఏ స్థాయి విజయాలు అందుకున్నాయో అందరికీ తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మించనున్న చిత్రంలో చరణ్‌కు జోడీగా తొలుత తమన్నాని ఎంపిక చేశారు. అయితే ఆమె ‘బాహుబలి’, ‘ఆగడు’ సినిమాలతో ఫుల్‌బిజీగా ఉండడంతో, ఆ అవకాశం కాజల్‌కు దక్కింది.
‘బాద్‌షా’ తర్వాత కాజల్ తెలుగులో ఏ సినిమా కమిట్ కాలేదు. ఆ లెక్కన చాలా విరామం తర్వాత కాజల్ చేస్తున్న తెలుగు సినిమా ఇదే. కృష్ణవంశీ దర్శకత్వంలో కాజల్ ఇంతకుముందు ‘చందమామ’ చేశారు. ఆ చిత్రంతోనే ఆమె కెరీర్‌కు బ్రేకొచ్చింది. ఈ కొత్త సినిమా చిత్రీకరణ కొత్త సంవత్సరంలో మొదలు కానుంది. ఇందులో చరణ్‌తో పాటు శ్రీకాంత్ కూడా నటించనున్నారు. మొదట ఆ పాత్ర వెంకటేష్ చేస్తారని ప్రచారం జరిగింది.