
తెరపైకి జ్యోతిలక్ష్మి జీవిత కథ
సినీతారల జీవిత కథలు తెరపైకి రావడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా శృంగారతార సిల్క్‌స్మిత జీవిత కథ పలు భాషల్లో చిత్రంగా రూపొందింది.
సినీతారల జీవిత కథలు తెరపైకి రావడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా శృంగారతార సిల్క్‌స్మిత జీవిత కథ పలు భాషల్లో చిత్రంగా రూపొందింది. హిందీలో ది దర్టీ పిక్చర్‌గా తెరకెక్కి ఘన విజయం సాధించింది. కన్నడంలో మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో మళ్లీ శృంగారతార జ్యోతిలక్ష్మి జీవిత కథ వెండితెరపైకి వస్తున్నట్లు తాజా సమాచారం. జ్యోతిలక్ష్మి, సిల్క్‌స్మిత కన్నా సీనియర్ నటి. 1960-70 ప్రాంతంలో తమిళం, తెలుగు తదితర దక్షిణాది భాషల్లో శృంగార నర్తకిగా పేరుపొందారు. పలు చిత్రాల్లో హీరోయిన్ గాను, ప్రతినాయికిగాను నటించి మెప్పించారు.
ఎంజీఆర్, శివాజిగణేశన్, ఎన్‌టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ వంటి ప్రఖ్యాత నటుల చిత్రాల్లో నటించి పేరు పొందారు. మరో ప్రముఖ శృంగార తార జయమాలిని ఈమె సోదరినే. కాగా జ్యోతిలక్ష్మి జీవిత చరిత్ర త్వరలో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు దర్శకుడు తెరపై ఆవిష్కరించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సిల్క్‌స్మిత జీవిత కథ నటి విద్యాబాలన్‌కు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. మరి జ్యోతిలక్ష్మి జీవిత చరిత్రలో నటించే నటి ఎవరు? ఆమెకు చిత్రం ఎలాంటి పేరు తెచ్చిపెట్టనుందన్న విషయాలు ముందుముందు తెలియనున్నాయి.