పాన్ మసాలా ప్రమోషన్కు జేమ్స్బాండ్ | James Bond pierce Brosnan Endorses Indian Pan Masala | Sakshi
Sakshi News home page

పాన్ మసాలా ప్రమోషన్కు జేమ్స్బాండ్

Oct 7 2016 1:20 PM | Updated on Sep 4 2017 4:32 PM

పాన్ మసాలా ప్రమోషన్కు జేమ్స్బాండ్

పాన్ మసాలా ప్రమోషన్కు జేమ్స్బాండ్

సాధారణంగా ఏ బ్రాండ్ అయినా ప్రమోట్ చేయడానికి అక్కడి లోకల్ స్టార్స్ను తీసుకుంటారు. కాస్త పెద్ద బ్రాండ్ అయితే బాలీవుడ్ స్టార్స్ని ట్రై చేస్తారు. కానీ ఇండియాకు చెందిన ఓ పాన్ మసాలా కంపెనీ వారు...

సాధారణంగా ఏ బ్రాండ్ అయినా ప్రమోట్ చేయడానికి అక్కడి లోకల్ స్టార్స్ను తీసుకుంటారు. కాస్త పెద్ద బ్రాండ్ అయితే బాలీవుడ్ స్టార్స్ని ట్రై చేస్తారు. కానీ ఇండియాకు చెందిన ఓ పాన్ మసాలా కంపెనీ వారు మాత్రం ఏకంగా తమ బ్రాండ్ ప్రమోషన్కు హాలీవుడ్ స్టార్ హీరోనే దించేశారు. అది కూడా జేమ్స్బాండ్ సీరిస్తో అంతర్జాతీయంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పీర్స్ బ్రోస్నన్తో ఇండియన్ పాన్ మసాలాను ప్రమోట్ చేయిస్తున్నారు.

శుక్రవారం ఉదయం అన్ని జాతీయ పత్రికల్లో వార్తలతో పాటు ఓ యాడ్ కూడా ప్రముఖంగా ఆకర్షించింది. వరుస బాండ్ చిత్రాలతో అలరించిన మాజీ జేమ్స్బాండ్ పీర్స్ బ్రోస్నన్ చేతిలో ఇండియాలో తయారైన పాన్ మసాలా డబ్బా ఉన్న ఈ యాడ్ అందరినీ ఆకట్టుకుంటోంది. గతంలో సైఫ్ అలీఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ప్రమోట్ చేసిన ఈ బ్రాండ్కు ప్రస్తుతం ఈ హాలీవుడ్ స్టార్ అంబాసిడర్గా వ్యవహరించేందుకు అంగీకరించారు. బాండ్ ప్రచారం పాన్ మసాలాకు ఇంటర్నేషనల్ ఫేం తీసుకు వస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement