ముంబైకు వచ్చిన కొత్తలో ఎగతాళి చేశారు: బాలీవుడ్‌ నటి

Jacqueline Fernandez: What I Have Faced For First Time Come To Mumbai - Sakshi

ముంబై : బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో తన ఎంట్రీ అనుకున్నంత సులువుగా జరగలేదన్నారు శ్రీలంక మాజీ మిస్‌ యూనివర్స్‌ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌. శ్రీలంకలో పుట్టి పెరిగిన జాక్వెలిన్‌ ప్రస్తుతం బాలీవుడ్‌లో స్థిరపడ్డారు. బీటౌన్‌లో అడుగుపెట్టి సక్సెస్‌ఫుల్‌గా పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. కాగా ఇటీవలే ప్రభాస్‌ నటించిన ‘సాహో’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన విషయం తెలిసిందే. సాహోలోని ఓ పాటలో ప్రభాస్‌తో కలిసి ఆడిపాడారు. ఇక తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు ఈ భామ. ఈ సందర్భంగా.. మొదటిసారి ముంబైలో అడుగు పెట్టినప్పుడు ఎదుర్కొన్న విచిత్ర సంఘటనల గురించి చెప్పుకొచ్చారు. బాలీవుడ్‌లో పదేళ్లుగా తన  ప్రయాణం ఎలా సాగిందో వెల్లడించారు. (‘మాకు ఓ అన్నయ్య ఉంటే బాగుండు’)

ఆమె మాట్లాడుతూ.. ‘శ్రీలంకలో 2016లో మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ గెలుచుకున్న తర్వాత ముంబైకి వెళ్లి అక్కడ హీరోయిన్‌గా రాణించాలనుకున్నాను. ఫస్ట్‌ టైం ముంబైకు వచ్చినప్పుడు నన్ను ఓ పరాయి వ్యక్తిగా చూశారు. నా ముఖంలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచనలు ఇచ్చారు. ముక్కుకు సర్జరీ చేసుకోవాలని, పేరు బాగా వెస్ట్రన్‌గా ఉందని ‘ముస్కాన్‌’గా మార్చుకోవాలని, కనుబొమ్మలను ఒత్తుగా మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చారు. అలాగే నేను మాట్లాడే హిందీని చాలా మంది ఎగతాళి చేశారు. ప్రజలు నన్ను ‘ఫిరంగి నటి’ అంటూ తిట్టేవారు’. అని చెప్పుకొచ్చారు. అయితే అవేవి పట్టించుకోకుండా తనకు తానుగా ఉండాలనుకున్నారని.. అది తనకెంతో కలిసొచ్చిందన్నారు. ఎవరేం అనుకున్నా.. వెనకడుగు వేయకుండా ధైర్యంగా నిలబడి నేడు పరిశ్రమలో నిలదొక్కుకున్నారని బదులిచ్చారు.
(సాహో : ఒక్కపాటకు 2 కోట్ల పారితోషికం!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top