
వాళ్లిద్దరూ చాలా హాట్!
‘హీరోల్లో మీకెవరంటే ఇష్టం?’ అని ఏ హీరోయిన్‌ని అడిగినా... ‘అందరూ ఇష్టమేనండి’ అని అంటుంటారు.
‘హీరోల్లో మీకెవరంటే ఇష్టం?’ అని ఏ హీరోయిన్‌ని అడిగినా... ‘అందరూ ఇష్టమేనండి’ అని అంటుంటారు. ఒకళ్ల పేరు చెప్పి, ఇంకొకరి పేరు చెప్పకుండా.. అనవసరంగా వివాదాల్లో ఇరుక్కోవడం ఎందుకని ‘సేఫ్ ఆన్సర్’ ఇచ్చేస్తారు. కానీ, రెజీనా లాంటి కొంతమంది కథానాయికలు మాత్రం, ఎవరు నచ్చితే వాళ్ల పేరు చెబుతారు. అంతవరకూ ఫరవాలేదు.. ‘ఫలానా హీరో చాలా హాట్’ అని కూడా బోల్డ్‌గా చెప్పేస్తారు. ఇప్పుడు రెజీనా అదే చేశారు. ఇటీవల ఓ సందర్భంలో ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో మహేశ్‌బాబు, రామ్‌చరణ్ భలే సెక్సీ’’ అని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు దీని గురించే నలుగురూ చర్చించుకుంటున్నారు.
ఎలాంటి మొహమాటం లేకుండా ఈ బ్యూటీ స్టేట్‌మెంట్ ఇచ్చేసిందనీ, ఎంతైనా చాలా బోల్డ్ అనీ తెగ మెచ్చుకుంటున్నారు. మహేశ్‌బాబు, రామ్ చరణ్‌లు ‘సెక్సీ’ అని రెజీనా అంటే.. ఈ బ్యూటీని ఉద్దేశించి చాలామంది ఈ మాట అంటున్నారు. దానికి కారణం హిందీ చిత్రం ‘ఆంఖే 2’ కోసం రెజీనా చాలా హాట్‌గా తయారవ్వడమే. ఈ చిత్రంలో ఏ రేంజ్‌లో కనిపించనున్నారో శాంపిల్ చూపించడానికి ట్విట్టర్‌లో కొన్ని ఫొటోలు కూడా పెట్టారు. అవి చూసినవాళ్లు ‘రెజీనా చాలా హాట్ గురూ’ అని నోరు వెళ్ళ బెడుతున్నారు.