
చెన్నై: ఫైనాన్షియర్ అన్బుచెళియన్ కందువడ్డీ వ్యవహారంలో హీరో విశాల్‌కు వాట్సాప్ ద్వారా బెదిరింపులు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై వడపళని, ఆర్కాడ్ రోడ్డుకు చెందిన మణిమారన్ అనే సినీ నిర్మాత బుధవారం ఉదయం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఇటీవల సహ నిర్మాత అశోక్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారని.. ఫైనాన్షియర్ అన్బుచెళియన్ అనుచరుల బెదిరింపులతోనే తాను చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సంఘటనతో స్పదించిన నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్.. కందువడ్డీ బాధిత నిర్మాతలు ఎవరైనా ఉంటే తన సంఘానికి ఫిర్యాదు చేయాలని కోరారు. దీంతో అన్బుచెళియన్ తరపు వారు వాట్సాప్ ద్వారా జాతి, మత విద్వేశాలు ప్రేరేపించేలా బెదిరింపులు చేస్తున్నారని ఆయన తెలిపారు. అన్బెచెళియన్ కుల, మత భేదాలతో కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి విద్వేష చర్యలను తమిళనాడులో వ్యాపించనీయరాదని అన్నారు.
కుల మతాల కతీతంగా ప్రజలు మత సామరస్యంతో జీవిస్తున్నారు. కాబట్టి సినిమా రంగాన్ని ఇలాంటి ఫైనాన్షియర్ల నుంచి రక్షించి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.