ఆ టెన్షన్‌లో కిక్‌ ఉంటుంది

Hero Nani Speech At Gang Leader Movie Press Meet - Sakshi

– నాని

‘‘సాధారణంగా పరీక్షలప్పుడు ఉండే టెన్షన్‌ సినిమా విడుదలప్పుడు ఉంటుంది. రిలీజ్‌కు ముందు ఉండే ఈ రెండు రోజులంటే నాకు చాలా ఇష్టం. ఈ రెండు రోజుల్లో ఉండే టెన్షన్‌లో మంచి కిక్‌ ఉంటుంది’’ అని నాని అన్నారు. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో నాని హీరోగా  రూపొందిన చిత్రం ‘నానీస్‌ గ్యాంగ్‌లీడర్‌’. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై  నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానుంది.

ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ– ‘‘సినిమాలో నవ్వులే కాదు.. మనసుని హత్తుకునే ఎమోషనల్‌ సీన్స్‌ కూడా ఉన్నాయి. సినిమాని చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశాం. అస్సలు ఒత్తిడికి గురి కాలేదు. ఏదో పెయిడ్‌ హాలిడేలా గడిచింది. ఈ సినిమాలో కొత్త కార్తికేయ (‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌)ను చూస్తారు. ఈ సినిమా తర్వాత ప్రియాంకకు చాలా అవకాశాలు వస్తాయి. విక్రమ్‌ బాగా డైరెక్ట్‌ చేశారు. పోలాండ్‌ కెమెరామన్‌ మిరోస్లా కుబా మా సినిమాను కొత్త కోణంలో చూపించారు.

అనిరుద్‌ మంచి సంగీతం అందించారు. విడుదల చేసిన ప్రతి పాటకు మంచి స్పందన లభిస్తోంది’’  అన్నారు. ‘‘కథ, నా పాత్ర నచ్చి ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. ఒకవేళ ఈ సినిమా చేయకపోతే ఏదో కోల్పోయేవాడినని నాకు ఇప్పుడు అర్థం అవుతోంది. విక్రమ్, నానీగార్ల నుంచి చాలా నేర్చుకున్నాను. బ్లాక్‌బ్లస్టర్‌ సినిమాలు ఎన్ని వచ్చినా రిఫరెన్స్‌ సినిమాలు కొన్నే ఉంటాయి. ఆ జాబితాలో ఈ చిత్రం ఉంటుంది. ఆల్రెడీ నాని ఖాతాలో ‘జెర్సీ’ ఉంది. నాని ఇలాంటి విభిన్నమైన కథలు ఎంచుకుంటారు.

అందుకే ఆయన నేచురల్‌స్టార్‌’’ అన్నారు కార్తికేయ. ‘‘ఎడిటర్‌ నవీన్, మా డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌ చాలా కష్టపడ్డారు. సహకరించిన టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు దర్శకుడు విక్రమ్‌. ‘‘నానీగారితో మా బ్యానర్‌లో సినిమా చేయడానికి మూడేళ్లు పట్టింది. మరో సినిమా చేయడానికి ఇంత సమయం పట్టదనుకుంటున్నాను. సినిమా బ్లాక్‌బ్లస్టర్‌ అవుతుంది’’ అన్నారు నిర్మాత నవీన్‌. ‘‘ఈ సినిమాను ఆరు నెలల్లో పూర్తి చేశాం. విక్రమ్‌గారి ప్రణాళిక వల్లే సాధ్యమైంది’’ అన్నారు మైత్రీ మూవీ మేకర్స్‌ సీఈఓ చెర్రీ. ‘‘మా గ్యాంగ్‌లీడర్‌ని చూసేందుకు మీ గ్యాంగ్స్‌తో థియేటర్స్‌కు రండి’’ అన్నారు కథానాయిక ప్రియాంక.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top