యువత దారి తప్పితే... | gunna mamidi komma meeda movie releases 5th December | Sakshi
Sakshi News home page

యువత దారి తప్పితే...

Dec 1 2014 10:57 PM | Updated on Sep 27 2018 8:33 PM

యువత దారి తప్పితే... - Sakshi

యువత దారి తప్పితే...

చిన్నప్పట్నుంచీ స్నేహితులైన ముగ్గురు యువకులూ, ముగ్గురు యువతులూ పై చదువుల కోసం నగరానికి వచ్చి ఒకచోట కలిసి ఉంటారు.

చిన్నప్పట్నుంచీ స్నేహితులైన ముగ్గురు యువకులూ, ముగ్గురు యువతులూ పై చదువుల కోసం నగరానికి వచ్చి ఒకచోట కలిసి ఉంటారు. ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘గున్నమామిడి కొమ్మ మీద’. విక్కీ, విజయ్, దామోదర్, ప్రియాంక, శిరీష, స్పందన నాయకా నాయికలు. అల్లీపురం దామోదర్ దర్శకత్వంలో కేశవ సిరి క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘యువత దారి తప్పితే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి? అనేది ఈ చిత్రంలో ప్రధానాంశం. వినోదం మాత్రమే కాదు.. యువతకు చక్కని సందేశం కూడా ఇస్తున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ముస్తఫా, కెమెరా: సాయి, ఎడిటింగ్: కిశోర్.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement