ఆ సినిమా పోస్టర్‌పై ఫిర్యాదు..! | give complaint on arjun reddy movie wall poster | Sakshi
Sakshi News home page

ఆ సినిమా పోస్టర్‌పై ఫిర్యాదు..!

Aug 22 2017 6:45 PM | Updated on Sep 17 2017 5:51 PM

ఆ సినిమా పోస్టర్‌పై ఫిర్యాదు..!

ఆ సినిమా పోస్టర్‌పై ఫిర్యాదు..!

అర్జున్‌ రెడ్డి సినిమాపై బీసీ యువజన సంఘం నాయకులు మంగళవారం మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్‌: అర్జున్‌ రెడ్డి సినిమాపై బీసీ యువజన సంఘం నాయకులు మంగళవారం మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకరమైన పోస్టర్‌ను చిత్రికరించిన అర్జున్‌ రెడ్డి సినిమా నిర్మాత, దర్శకుడు, హీరో, హీరోయిన్‌లపై తగిన చర్యలు తీసుకోవాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకాల  శ్యామ్‌కురుమ పోలీసులకు విన్నవించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువతను పెడదారి పట్టించే విధంగా చిత్రికరించిన వాల్‌పోస్టర్‌ను విద్యాసంస్థలు, ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌ ప్రాంతాలలో అతికించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. యువతను ఆకర్షించడానికి పోస్టర్ల ద్వారా విష సంస్కృతిని ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ఎక్కడ చూసినా అర్జున్‌ రెడ్డి సినిమా పోస్టర్‌ కనిపిస్తుందని వాటిని వెంటనే నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.

సినిమా విడుదల కాకుండా చర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు కోరారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామని అడ్మిన్‌ ఎస్సై రంజిత్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement