గౌతమ్‌ని చూస్తే ‘పోరాటం’లో మహేష్ గుర్తొచ్చాడు | gautam remembers mahes babu : krishna | Sakshi
Sakshi News home page

గౌతమ్‌ని చూస్తే ‘పోరాటం’లో మహేష్ గుర్తొచ్చాడు

Jan 10 2014 11:43 PM | Updated on Sep 2 2017 2:29 AM

గౌతమ్‌ని చూస్తే  ‘పోరాటం’లో మహేష్ గుర్తొచ్చాడు

గౌతమ్‌ని చూస్తే ‘పోరాటం’లో మహేష్ గుర్తొచ్చాడు

‘‘అప్పట్లో ‘పోరాటం’ సినిమాలో మహేష్ బాల నటుడిగా చాలా ఈజ్‌తో చేశాడు. ఇప్పుడు ఈ సినిమాలో గౌతమ్‌ని చూస్తుంటే ‘పోరాటం’లో మహేష్ గుర్తొస్తున్నాడు.

 ‘‘అప్పట్లో ‘పోరాటం’ సినిమాలో మహేష్ బాల నటుడిగా చాలా ఈజ్‌తో చేశాడు. ఇప్పుడు ఈ సినిమాలో గౌతమ్‌ని చూస్తుంటే ‘పోరాటం’లో మహేష్ గుర్తొస్తున్నాడు. గౌతమ్ చాలా ఈజ్‌తో చేశాడు’’ అని కృష్ణ చెప్పారు. మహేష్‌బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘1’ (నేనొక్కడినే) చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమా ప్రివ్యూని హైదరాబాద్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి కృష్ణ చూశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ -‘‘ఇందులో మహేష్ నటన అసాధారణంగా ఉంది.
 
  ఒక రెగ్యులర్ సినిమాలా కాకుండా హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. సుకుమార్ చాలా బాగా తీశాడు. ఫొటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మొదటివారమే పెద్ద రికార్డ్ క్రియేట్ చేస్తుంది’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement