32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

Game of Thrones 8 Earns Record-Breaking 32 Emmy Award Nominations - Sakshi

లాస్‌ ఎంజిల్స్‌ :  ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన టెలివిజన్‌ సిరీస్‌లలో గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ ఒకటి. ఈ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు. తాజాగా ప్రతిష్టాత్మకమైన ఎమ్మి అవార్డ్స్‌లో ‘గేమ్‌ ఆఫ్‌ త్రోన్స్‌’ ఎనిమిదో సీజన్‌  రికార్డుస్థాయిలో 32 నామినేషన్లను సంపాదించింది. ‘ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ ’లో ఇదే చివరి సిరీస్‌. ఇక, దీంతోపాటు న్యూక్లియర్‌ కాన్సెప్ట్‌ ఆధారంగా రూపొందిన 'చెర్నోబిల్‌ '19, 'సాటర్‌డే నైట్‌ లైవ్‌' 18 నామినేషన్లు సాధించాయి. 

కామెడీ సిరీస్‌ విభాగంలో అమెరికన్‌ పిరియాడికల్‌ డ్రామా 'మార్వలస్‌ మిసెస్‌ మెయిసిల్‌' 20 నామినేషన్లతో తన సత్తా చాటింది. వ్యక్తిగత అవార్డ్స్‌ విషయానికొస్తే.. ఎమ్మీ ఉత్తమ నటి విభాగంలో గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ స్టార్‌ ఎమిలియా క్లార్క్‌, 'కిల్లింగ్‌ ఈవ్‌' ఫేమ్‌ సండ్రా ఓ, 'హౌ టు గెట్‌ అవే విత్‌ మర్డర్‌'లో నటించిన విలోవా డేవిస్‌లు పోటీ పడుతున్నారు. 71వ ఎమ్మి అవార్డ్స్‌ వేడుకలు సెప్టెంబర్‌ 22న ఫాక్స్‌ చానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. దీనికి సంబందించి ఇంతవరకు హోస్ట్‌ను మాత్రం ప్రకటించలేదు.

1994లో వచ్చిన అమెరికన్‌ టెలివిజన్‌ సిరీస్‌  'ఎన్‌వైపీడీ బ్లూ' అప్పట్లోనే రికార్డుస్థాయిలో 27 నామినేషన్లు దక్కించుకుంది. తాజాగా ఆ రికార్డును గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ చెరిపేసింది. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ ఎమ్మి అవార్డ్స్‌లో తన ఆధిక్యతను నిలబెట్టుకొని వరుసగా నాలుగోసారి  ట్రోఫీని సాధిస్తే గత 25 సంవత్సారాల్లో అత్యధిక ప్రజాదరణ పొందిన టెలివిజన్‌ డ్రామాలైన హిల్‌ స్ట్రీట్‌ బ్లూస్‌, ఎల్‌ఏ లా, ది వెస్ట్‌ వింగ్‌, మ్యాడ్‌మెన్‌ సరసన చోటు సంపాదించనుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top