లాఫింగ్‌ రైడ్‌

Fun rides heroine Revathi and Jyothika - Sakshi

నెల రోజులకు పైగా సెట్‌లో ఫన్‌ రైడ్‌ చేశారు కథానాయికలు రేవతి అండ్‌ జ్యోతిక. ఆ నవ్వుల హంగామాను ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు ప్రారంభించారు. రేవతి, జ్యోతిక ముఖ్య తారలుగా ‘గులేబకావళి (2018)’ ఫేమ్‌ ఎస్‌. కల్యాణ్‌ దర్శకత్వంలో ఆ మధ్య ఓ సినిమా మొదలైంది. ఈ సినిమా చిత్రీకరణను కేవలం 35 రోజుల్లో పూర్తి చేశారు టీమ్‌. ఇంత తక్కువ సమయంలో సినిమా పూర్తి చేయడం అంటే టీమ్‌ అంతా ఎంత అంకితభావంతో వర్క్‌ చేసి ఉంటారో ఊహించుకోవచ్చు.

ఈ సినిమా చివరి రోజు చిత్రీకరణకు హీరో సూర్య కూడా హాజరుకావడం విశేషం. ఈ చిత్రానికి సూర్య ఒక నిర్మాత. ఫుల్‌ కామెడీ నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం ద్విచక్ర వాహనం కూడా నడిపారు జ్యోతిక అండ్‌ రేవతి. ఇంకా యోగి బాబు, మన్సూర్‌ అలీ, ఆనంద్‌రాజ్‌ కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకు విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందించారు.  ఈ సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top