సౌతిండియాలో అదే నెం.1 వీడియోసాంగ్‌

Fidaa Vachinde Song South Indians Fastest And Highest Viewed Song - Sakshi

వచ్చిండే.. అనే పాట వింటే సాయి పల్లవి స్టెప్పులు గుర్తుకురావాల్సిందే. ఫిదా సినిమాలోని ఈ పాట అప్పట్లో సంచలనం సృష్టించింది. ఎక్కడ చూసినా ఈ పాటే.. ఏ స్టేజ్‌పైనా అవే స్టెప్పులు. అంతలా అందరి మనుసుల్లో నాటుకుపోయిందీ పాట. 

సాయి పల్లవి డ్యాన్సులకు ఎంతో మంది ఫ్యాన్స్‌ ఉన్న విషయం తెలిసిందే. సినిమాలో తను చేసే పాత్రలైనా, పాటల్లో వేసే స్టెప్పులైనా అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అవే ఇప్పుడు యూట్యూబ్‌లో రికార్డులను క్రియేట్‌ చేస్తున్నాయి. మూడు రోజులు క్రితం రిలీజైన ‘రౌడీ బేబీ’ వీడియో సాంగ్‌ యూట్యూబ్‌కు నిద్రపట్టకుండా చేస్తుంటే.. ఫిదాలోని వచ్చిండే సాంగ్‌.. సౌత్‌ఇండియాలో అత్యంత వేగంగా.. ఎక్కువ వ్యూస్‌ సాధించిన వీడియోసాంగ్‌గా రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ వీడియో సాంగ్‌ను ఇప్పటివరకు 173మిలియన్స్‌ (17.38కోట్లు) వ్యూస్‌ను సాధించింది. సాయి పల్లవి.. తన హావాభావాలు, డ్యాన్సులతో ప్రేక్షకులను కట్టిపడేయడమే ఈ వీడియో సాంగ్స్‌కు ఇంతటి రెస్పాన్స్‌ రావడానికి కారణం. మరోసారి ఈ వీడియో సాంగ్‌ను చూసేయండి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top