‘వర్మ’ వివాదంపై స్పందించిన బాలా

Director Bala Clarifies on Varmaa Controversy - Sakshi

టాలీవుడ్‌ సెన్సేషనల్‌ హిట్ ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాను తమిళంలో వర్మ పేరుతో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో విక్రమ్‌ వారసుడు ధృవ్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అవుట్‌పుట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో నిర్మాతలు సినిమాను రీషూట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. బాలా ఇచ్చిన ఫస్ట్‌ కాపీ సంతృప్తిగా లేకపోవటంతో మరో దర్శకుడితో సినిమాను రీ షూట్ చేస్తున్నామని వెల్లడించారు.

అయితే ఈ విషయంపై దర్శకుడు బాలా స్పందించారు. ప్రాజెక్ట్‌ నుంచి తనను ఎవరూ తప్పించలేదని. తానే ప్రాజెక్ట్‌ ను వదిలి బయటకు వచ్చేశానని తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసిన బాలా అందుకు సాక్ష్యాలుగా నిర్మాణ సంస్థతో చేసుకున్న అగ్రిమెంట్‌ కాపీలను కూడా విడుదల చేశారు. ధృవ్‌ విక్రమ్‌ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top