కైకాలఃదీర్ఘాయుష్మాన్‌ భవ | "Dheerga Ayushman Bhava" Title Logo Released | Sakshi
Sakshi News home page

కైకాలఃదీర్ఘాయుష్మాన్‌ భవ

Dec 22 2017 12:31 AM | Updated on Dec 22 2017 12:31 AM

"Dheerga Ayushman Bhava" Title Logo Released  - Sakshi

సీనియర్‌ నటులు కైకాల సత్యనారాయణ చాలా విరామం తర్వాత ఓ కీలక పాత్ర చేసిన చిత్రం ‘దీర్ఘ ఆయుష్మాన్‌ భవ’. కార్తీక్‌ రాజు, మిస్తీ చక్రవర్తి జంటగా ఎం.పూర్ణానంద్‌ దర్శకత్వంలో జి.ప్రతిమ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ లోగోను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఎం.పూర్ణానంద్‌ మాట్లాడుతూ– ‘‘ఇప్పటివరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా తెరకెక్కుతోన్న సోషియో ఫాంటసీ ప్రేమకథా చిత్రమిది. సినిమా ఆద్యంతం ఫ్రెష్‌ లుక్‌తో ఉంటుంది. మూడు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. గ్రాఫిక్‌ వర్క్‌ జరుగుతోంది. ఫిబ్రవరిలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు.

‘‘నా గత చిత్రాల కంటే వైవిధ్యంగా ఉండే సినిమా ఇది. పూర్ణానంద్‌గారు ఓ గమ్మత్తెన ప్రేమకథతో తీస్తున్నారు. ‘దీర్ఘ ఆయుష్మాన్‌ భవ’ ఈ కథకు కరెక్ట్‌ టైటిల్‌’’ అన్నారు కార్తీక్‌ రాజు. ‘‘నేటి తరం ప్రేమకథల్లో ఇదొక విభిన్నమైన కథ, కథనాలతో తెరకెక్కుతోంది. నా పాత్రకు మంచి ప్రాధాన్యం ఉంటుంది’’ అన్నారు మిస్తీ చక్రవర్తి. నోయల్, ఆమని, పృథ్వీరాజ్, కాశి విశ్వనా«థ్, ‘సత్యం’ రాజేష్, ‘తాగుబోతు’ రమేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement