హాయ్‌ డాడీ; అలాంటిదేమీ లేదు! | Deepika Padukone On Rumours Which Started After Her Hi Daddie Comment | Sakshi
Sakshi News home page

మేము చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నాం: దీపికా

Oct 11 2019 6:54 PM | Updated on Oct 11 2019 7:21 PM

Deepika Padukone On Rumours Which Started After Her Hi Daddie Comment - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ తల్లి కాబోతున్నారంటూ మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే బుల్లి రణ్‌వీర్‌ లేదా దీపికా రాబోతున్నారంటూ సోషల్‌ మీడియాలో దీప్‌వీర్‌ ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు. రణ్‌వీర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ సెషన్‌కు దీపికా ఇచ్చిన క్యాప్షనే ఇందుకు కారణం. ఇన్‌స్టా సెషన్‌లో భాగంగా ఫ్యాన్స్‌తో ముచ్చటిస్తున్న రణ్‌వీర్‌ను.. దీపికా హాయ్‌ డాడీ అంటూ పలకరించారు. అంతేగాకుండా ఇందుకు బేబీ ఎమోజీని కూడా జతచేశారు. దీంతో ఫ్యాన్స్‌తో పాటు బీ-టౌన్‌ సెలబ్రిటీలు కూడా దీప్‌వీర్‌ను ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. ‘భయ్యా.. వదిన మీకు త్వరలోనే స్పెషల్‌ గిఫ్ట్‌ ఇవ్వబోతున్నట్లు అనిపిస్తోంది’ అంటూ హీరో అర్జున్‌ కపూర్‌ కామెంట్‌ చేయడంతో నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు చెబుతూ ఆటపట్టించారు.

కాగా ఈ విషయంపై స్పందించిన దీపికా ఇవన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశారు. ఇలాంటి రూమర్లు రావడం ఇదేమీ కొత్త కాదని.. వీటిని తేలికగా తీసుకోవడం అలవాటు చేసుకున్నానని తెలిపారు. ‘ ఇలాంటి వార్తలు నన్ను ఏమాత్రం ఆశ్చర్యపరచలేదు. మా ఇద్దరికీ పిల్లలు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా రణ్‌వీర్‌కి. అయితే ఇప్పట్లో పిల్లల్ని కనే ఆలోచన లేదు. మేము కెరీర్‌ పట్ల చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నాం. అందుకే పిల్లల విషయంలో సరైన సమయంలోనే నిర్ణయం తీసుకుంటాం. అయినా మన సమాజంలో అర్థంలేని కొన్ని ప్రశ్నలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. ప్రేమలో ఉన్నారంటూ పెళ్లెప్పుడూ అని నస పెడతారు. పెళ్లైన తర్వాత పిల్లలు, ఆ తర్వాత మనవలు ఎప్పుడు అంటూ అడుగుతూనే ఉంటారు’ అని పేర్కొన్నారు. కాగా ఎన్నో ఏళ్లుగా ప్రేమలో ఉన్న దీపికా- రణ్‌వీర్‌ గతేడాది నవంబరులో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ రొమాంటిక్ కపుల్‌గా పేరొం‍దిన దీప్‌వీర్‌ జంట ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement