అమిర్ నాకు పెట్ట‌కుండానే తిన్నారు: దీపిక‌ | Deepika Padukone Major Throwback Pic With Aamir Khan | Sakshi
Sakshi News home page

అమిర్ నాకు పెట్ట‌కుండానే తిన్నారు: దీపిక‌

May 16 2020 2:14 PM | Updated on May 16 2020 2:54 PM

Deepika Padukone Major Throwback Pic With Aamir Khan - Sakshi

లాక్‌డౌన్ కార‌ణంగా ఇంట్లోనే ఉంటున్న సెల‌బ్రిటీలు త‌మ చిన్ననాటి జ్ఞాప‌కాల‌ను అభిమానుల‌తో పంచుకుంటున్నారు. లాక్‌డౌన్‌లో స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండా ఇంట్లో ప‌నులు, వంట‌లు నేర్చుకోవ‌డంపై దృష్టి సారిస్తున్నారు. వీటిని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. ఇటీవ‌ల బాలీవుడ్ స్టార్ దీపికా ప‌దుకొనె 20 ఏళ్ల క్రితం ఆమిర్‌ఖాన్‌తో దిగి‌న చిత్రాన్ని పంచుకున్నారు. ఈ ఫోటోలో దీపికా, ఆమె తండ్రి ప్ర‌కాష్ ప‌దుకొనె, త‌ల్లి ఉజ్జ‌ల‌, సోద‌రి అనిషాతో పాటు అమిర్ ఖాన్ కూడా ఉన్నారు. ఈ చిత్రాన్ని షేర్ చేస్తూ దీని వెన‌కాల ఉన్న ఓ స‌ర‌దా స్టోరీని వెల్ల‌డించారు. అమిర్ ఖాన్‌తో భోజ‌న సంద‌ర్భంలో ఎదుర్కొన్న‌ ఇబ్బందిక‌ర సంఘ‌ట‌నను ఆమె పేర్కొన్నారు. (సితూ పాప కోసం సూపర్‌ స్టార్‌ ఏం చేశారంటే.. )

''ఇది జ‌న‌వ‌రి1, 2000 నాటి ఫోటో. నాకు అప్పుడు 13 ఏళ్లు. త‌న‌తో  ఇబ్బందిగా అనిపించిన‌ప్ప‌టికీ అక్క‌డే ఉన్నాను. ఆ స‌మ‌యంలో అమిర్ పెరుగ‌న్నంతో భోజ‌నం చేస్తున్నాడు. నేను ఎప్ప‌టిలాగే ఆక‌లితో ఉన్నాను. కానీ ఆయ‌న నాకు పెట్ట‌కుండానే తిన్నారు. నేను కూడా ఆయ‌న్ను అడ‌గ‌లేదు.'' అంటూ ఫ‌న్నీ క్యాప్ష‌న్ పెట్టారు. దీపికా పదుకొనె ఇటీవ‌ల న‌టించిన ఛ‌పాక్ చిత్రంపై స్పందించిన అమిర్.. ఛ‌పాక్ గొప్ప సినిమా అని, మేఘనా, దీపిక, విక్రాంత్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం దీపికా, క‌బీర్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న 8'3'లో న‌టిస్తున్నారు. మరోవైపు అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా'లో కరీనా కపూర్‌తో కలిసి నటిస్తున్నారు.
(క‌రోనా విజృంభ‌ణ‌: ఆరోగ్య‌శాఖ మంత్రి రాజీనామా )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement