'లోఫర్'లో విలన్ గా చరణ్ దీప్ | Charandeep plays baddie in 'Loafer' | Sakshi
Sakshi News home page

'లోఫర్'లో విలన్ గా చరణ్ దీప్

Jul 27 2015 2:25 PM | Updated on Aug 17 2018 2:27 PM

'లోఫర్'లో విలన్ గా చరణ్ దీప్ - Sakshi

'లోఫర్'లో విలన్ గా చరణ్ దీప్

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లోఫర్' సినిమాలో విలన్ గా నటిస్తున్నట్టు నటుడు చరణ్ దీప్ తెలిపాడు.

చెన్నై: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లోఫర్' సినిమాలో విలన్ గా నటిస్తున్నట్టు నటుడు చరణ్ దీప్ తెలిపాడు. 'లోఫర్'లో నటించే అవకాశం తనకు లభించిన బర్త్ డే గిప్ట్ అని పేర్కొన్నాడు. పూరితో కలిసి పనిచేయడం తనకెంతో  సంతోషంగా ఉందన్నాడు. ఆయన కోసం పలు సినిమాలు వదులుకున్నానని వెల్లడించాడు.

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'లోఫర్' షూటింగ్ ప్రస్తుతం జోధ్ పూర్ లో జరుగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తయింది. జిల్లా, పటాస్ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించాడు. పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్ 2' సినిమాలోనూ  చరణ్ దీప్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో తన పాత్ర ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పబోనని స్పష్టం చేశాడు. 'సర్దార్' పేరు పరిశీలనలో ఉన్న ఈ చిత్రంలో మరాఠీ నటుడు శరద్ కేల్కర్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement