బాలీవుడ్ నటి నందా మృతి | Bollywood actress Nanda killed | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ నటి నందా మృతి

Mar 26 2014 12:18 AM | Updated on Apr 3 2019 6:23 PM

బాలీవుడ్ నటి నందా మృతి - Sakshi

బాలీవుడ్ నటి నందా మృతి

అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటి నందా(75) ఇకలేరు. ఆమె మంగళవారం ఉదయం ముంబయ్‌లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు.

అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటి నందా(75) ఇకలేరు. ఆమె మంగళవారం ఉదయం ముంబయ్‌లోని  తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. నందా అందంతోపాటు చక్కటి నటనతో 1960, 70లలో వెండితెరను ఏలారు. ‘హమ్ దోనో’, ‘గుమ్నామ్’, ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’ తదితర చిత్రాల్లో మరపురాని, ఆధునిక భావాలున్న పాత్రలతో అభిమానులను ఆకట్టుకున్నారు.

దేవానంద్, కిశోర్ కుమార్, అశోక్ కుమార్, రాజేశ్ ఖన్నా తదితర హీరోలతో నటించారు. ప్రముఖ దర్శకుడు వి.శాంతారామ్‌కు మేనకోడలైన నందా 1939లో మహారాష్ట్రలో జన్మించారు. 1950లలో ‘జగ్గు’ సినిమాతో తెరంగేట్రం చేసిన నందా తొలినాళ్లలో చెల్లెలి పాత్రలు పోషించారు. ఆ తర్వాత నాయికగా చేశారు. 1992లో నడివయసులో నిర్మాత మన్మోహన్ దేశాయ్‌కి దగ్గరై 1994లో దేశాయ్ చనిపోయేంతవరకు ఆయనతో కలిసి జీవించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement