బిగ్‌బాస్‌పై శివ బాలాజీ షాకింగ్‌ కామెంట్స్‌!

Bigg Boss 3 Telugu: Shiva Balaji Says Entertainment Missing In This Season - Sakshi

బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3 తుది అంకానికి చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ సీజన్‌ విజేత ఎవరో తేలనుంది. అయితే తొలి రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గిందని బిగ్‌బాస్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి కంటెస్టెంట్స్‌ చాలా వీక్‌గా ఉన్నారని మరో వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా బంధాలు, ఎమోషన్స్‌, ప్రేమవ్యవహారాలతో ఈ సారి షోలో వినోదం తక్కువైందని వాపోతున్నారు. అదేవిధంగా బిగ్‌బాట్‌ టాస్కుల్లో కొత్తదనం లోపించిందని విమర్శిస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు అన్ని బిగ్‌బాస్‌ షోలు చూసి రావడంతో ఫిజికల్‌, సీక్రెట్‌ టాస్క్‌లను ముందే అంచనా వేస్తున్నారనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

దీంతో బిగ్‌ బాస్‌ అభిమానులు ఈ సీజన్‌ను చాలా బోరింగ్‌గా ఫీలవుతున్నామని చెప్పకనే చెబుతున్నారు. తాజాగా ఈ వాదనకు మరింత బలం చేకూరేలా బిగ్‌ బాస్‌ సీజన్‌ వన్‌ విన్నర్‌ శివబాలాజీ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజా సీజన్‌ను చూడటం లేదని నిర్మొహమాటంగా చెప్పేశాడు. దానికి గల కారణాలను కూడా వివరించాడు. తనకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే చాలా ఇష్టమని, అయితే అది ఈ సీజన్‌లో లోపించిందన్నాడు. అందుకే ఈ సీజన్‌ తనకు కనెక్ట్‌ కాలేదన్నాడు. ఆరంభంలో కొన్ని ఎపిసోడ్‌లు చూసినప్పుడే ఈ విషయం పక్కాగా అర్థమైందన్నాడు. ప్రస్తుతం షూటింగ్‌, వ్యక్తిగత పనులతో బిజీగా ఉండటం వలన బిగ్‌బాస్‌ షోను మొత్తానికే చూడటం మానేశానని పేర్కొన్నాడు. 

తొలి సీజన్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించడం ఆ సీజన్‌కు హైలెట్‌గా నిలిచింది. దీంతో పాటు శివబాలాజీ, ఆదర్శ్‌, అర్చన, నవదీప్‌, ప్రిన్స్‌ వంటి కంటెస్టెంట్‌లు చాలా బలంగా ఉన్నారు. అంతేకాకుండా ఇంటిసభ్యులు అభిమానులకు కావాల్సిన వినోదాన్ని డబుల్‌ పంచారు. దీంతో ఆ సీజన్‌ విజయం సాధించింది. అనంతరం రెండో సీజన్‌కు హోస్ట్‌ మారినా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ కాస్తా కూడా తగ్గలేదు. గీతామాధురి పాటలు.. దీప్తి మాటల ప్రవాహం.. తనీశ్‌, సామ్రాట్‌ల బ్రొమాన్స్‌.. కౌశల్‌ తన యాటిట్యూడ్‌తో పాటు గొడవలతో రెండో సీజన్‌ను హీటెక్కించాడు. 

ఇక మూడో సీజన్‌కు కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండటంతో వినోదం మినిమమ్‌ గ్యారెంటీగా  ఉంటుందని భావించారు.  అయితే ఈ సారి బిగ్‌బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లు షోలో చేసే ప్రదర్శన కంటే ముందుగా చేసుకున్న సోషల్‌ మీడియా క్యాంపైన్‌ మీదే ఎక్కువగా ఆధారపడినట్లు తెలుస్తోంది. అందుకే బిగ్‌బాస్‌లో ఆడినా ఆడకున్నా బయట తమకున్న ఫాలోయింగ్‌తో ఓట్లు రాబట్టి విజేతగా నిలవాలని అనుకుంటున్నారు. అయితే ఇంత ముందు చూపు ఉన్న కంటెస్టెంట్లు కాస్త టాస్క్‌లపై దృష్టి పెట్టాలని బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. 

చదవండి: 
బిగ్‌బాస్‌: వితికా ఎలిమినేట్‌.. ఇది ఫిక్స్‌!
బిగ్‌బాస్‌: ఆ ముగ్గురు సేఫ్‌..!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top