బిగ్‌బాస్‌: రవి చేయి పట్టుకుని సారీ చెప్పిన తమన్నా

Bigg Boss 3 Telugu: Grand Reunion Of All Contestants - Sakshi

రేపటితో బిగ్‌బాస్ షోకు ఎండ్‌ కార్డ్‌ పడనుంది. హలో యాప్‌ నిర్వహించిన కాంటెస్ట్‌లో విజేతలుగా నిలిచిన ఇద్దరు వ్యక్తులను బిగ్‌బాస్‌ టాప్‌ 5 కంటెస్టెంట్‌లను కలుసుకునే అవకాశం ఇచ్చాడు. అయితే వారు ఆకస్మాత్తుగా ఇంట్లోకి రావటంతో ఇంటి సభ్యులు మొదట షాకింగ్‌కు గురయ్యారు. అనంతరం తేరుకున్న హౌస్‌మేట్స్‌ వారితో కలిసి కాసేపు సరదాగా గడిపారు. వారు వెళ్లిపోయిన తర్వాత బిగ్‌బాస్‌ ఇంట్లోకి ప్రత్యేక అతిథులను పంపించారు. వాళ్లను చూడగానే ఇంటి సభ్యులు ఆనందంతో ఎగిరి గంతేశారు. మొదటగా రవి హౌస్‌లో అడుగుపెట్టగా అలీ వెళ్లి గట్టిగా హత్తుకున్నాడు. ఇంటి సభ్యులందరూ రవికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్లు తిరిగి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ప్రవేశిండంతో ఇల్లు కళకళలాడింది. వారి అల్లరితో మళ్లీ పాత రోజులు గుర్తుకు చేశారు.

ఇక పునర్నవి ఇంట్లోకి అడుగుపెట్టగానే శ్రీముఖి చంటిపిల్లలా ఎత్తుకుని ‘కరెక్ట్‌ ప్లేస్‌లో దింపుతా’నంటూ రాహుల్‌ దగ్గర వదిలిపెట్టింది. దీంతో రాహుల్‌ పునర్నవిని ఎత్తుకుని స్వాగతం పలికాడు. అనంతరం రాహుల్‌.. ‘బయట ఎలా ఉంద’ని ఆరా తీశాడు. ‘రెండువారాల్లో కొత్త  బెస్ట్‌ఫ్రెండ్స్‌ అయ్యారు కదా.. నేనేం చెప్పినా ఫేక్‌ అనిపిస్తది, ఎందుకంటే నేను ట్రూ బెస్ట్‌ ఫ్రెండ్‌ కాదు కదా’ అని పునర్నవి వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. ‘ఈ మధ్య ఇంగ్లీష్‌ మాట్లాడుతున్నావ్‌..’ అని పునర్నవి అనగా ‘నీతో తిరిగి తిరిగి వచ్చింది’ అని రాహుల్‌ పంచ్‌ వేశాడు. ‘సెన్స్‌ కూడా నాలా వస్తే బాగుండేది’ అని పున్ను రివర్స్‌ కౌంటర్‌ వేసింది. ఇక పొట్టి డ్రెస్‌తో ఎంట్రీ ఇచ్చిన తమన్నాను ‘రంభలా రెడీ అయి వచ్చిందే’ అంటూ బాబా కామెంట్‌ చేశాడు.

తన స్నేహితుడైన జాఫర్‌పైనా బాబా పంచ్‌లు విసిరాడు. అందరూ ఒకేచోటికి చేరడంతో బిగ్‌బాస్‌ ఇల్లు.. ఆనందాల హరివిల్లుగా మారింది. కంటెస్టెంట్ల కోసం బిగ్‌బాస్‌ ఓ వీడియోను ప్లే చేశాడు. వారి ఆటపాటలు, అల్లరి జ్ఞాపకాల మేళవింపుతో చేసిన వీడియో చూశాక తమన్నా కాస్త ఎమోషనల్‌ అయింది. బాధపెట్టినందుకు క్షమించమంటూ రవి చేయి పట్టుకుని కన్నీళ్లతో అర్థించింది. పర్వాలేదు అంటూ రవి ఆమెను ఊరడించాడు. అనంతరం బిగ్‌బాస్‌ ఇంట్లో పార్టీ జరుగుతోంది. దీనికోసం ఇంటి సభ్యులు అందంగా ముస్తాబయ్యారు. ఈ పార్టీలో అవార్డుల ఫంక్షన్‌ నిర్వహించనున్నారు. ఇప్పటికే అవార్డుల ఎంపికకోసం ఇంటి సభ్యుల సమాధానాలను బిగ్‌బాస్‌ అడిగి తెలుసుకున్నాడు. మరి ఈ పార్టీలో రచ్చ ఏరేంజ్‌లో ఉండబోతుందో చూడాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేవరకు ఆగాల్సిందే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top