ఇస్మార్ట్‌ స్టెప్స్‌ | Sakshi
Sakshi News home page

ఇస్మార్ట్‌ స్టెప్స్‌

Published Fri, Oct 18 2019 2:43 AM

Badshah Ft Nidhhi Agerwal is Aaho song Release - Sakshi

ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు నిధీ అగర్వాల్‌. ఆ జోష్‌తోనే  ఇస్మార్ట్‌ స్టెప్స్‌ వేయడానికి రెడీ అవుతున్నారు. హిందీ ర్యాపర్‌ బాద్‌షాతో కలసి నిధీ అగర్వాల్‌ ఓ మ్యూజిక్‌ వీడియో చేశారు. ఈ వీడియో ఇవాళ రిలీజ్‌ కానుంది. ఈ మ్యూజిక్‌ వీడియోకు బలీందర్‌ యస్‌. మహంత్‌ దర్శకత్వం వహించగా ఈ పాటను బాద్‌షాయే రాసి, పాడి, సంగీతం సమకూర్చారు.  ఈ వీడియోలో నిధీ గ్లామర్, తన స్టెప్స్, బాద్‌షా ర్యాప్‌ కచ్చితంగా మ్యూజిక్‌ లవర్స్‌కు ట్రీట్‌లా ఉంటుందని అనుకుంటున్నారు బాద్‌షా, నిధీ ఫ్యాన్స్‌. నిధీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తమిళంలో ‘జయం’ రవితో ఓ సినిమా చేస్తున్నారు. త్వరలోనే తెలుగులో తన తదుపరి సినిమా విశేషాలను ప్రకటించనున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement