శ్రీదేవి మళ్లీ పుడితే.. వైరల్ వీడియో | Baby Child Look Like Sridevi Viral Again In Social Media | Sakshi
Sakshi News home page

శ్రీదేవి మళ్లీ పుడితే.. వైరల్ వీడియో

Mar 2 2018 11:34 AM | Updated on Oct 22 2018 6:05 PM

Baby Child Look Like Sridevi Viral Again In Social Media - Sakshi

సాక్షి, హైదరాబాద్: ‘అతిలోక సుందరి’ శ్రీదేవి పోలికలతో ఉన్న ఓ చిన్నారి వీడియో మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. దుబాయ్‌లో తన మేనల్లుడి వివాహ వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్లిన నటి శ్రీదేవి ఫిబ్రవరి 24 రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. గతేడాది వైరల్ అయిన ఈ చిన్నారి ‘శ్రీదేవి’ వీడియో నటి చనిపోయిన నేపథ్యంలో మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నెలల వయసున్న ఓ చిన్నారి అచ్చం‌.. చిన్నప్పుడు శ్రీదేవి ఎలా ఉండేవారో అలాగే ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. శ్రీదేవి మళ్లీ పుడితే ఇలాగే ఉంటుందంటూ ఆమె అభిమానులు ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నారు.

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న చిన్నారి కళ్లు, ముక్కు, ముఖకవలికలు అచ్చు నటి శ్రీదేవిని పోలి ఉండటంతో ఆమె అభిమానులు నటిని స్మరించుకుంటూ మరోసారి సోషల్ మీడియాలో విపరీతంగా షేర్లు చేస్తున్నారు. కాగా, బాలనటిగా  సినీ జీవితంలోకి ప్రవేశించిన శ్రీదేవి అందంతోనే కాదు తనదైన నటనతో టాలీవుడ్‌, బాలీవుడ్‌ అన్న తేడా లేకుండా ఆమె నటించిన అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. దుబాయ్‌లో హఠాన్మరణం చెందిన శ్రీదేవి అంతిమ సంస్కారాలు ముంబై విల్లేపార్లేలోని సేవా సమాజ్‌ శ్మశాన వాటికలో మహారాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement