వారాహి బ్యానర్‌లో నిఖిల్, అవసరాల..?

Avasarala Srinivas Next With Nikhil in Varahi Banner - Sakshi

హాస్యనటుడిగా ఎంట్రీ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్‌ తరువాత దర్శకుడిగానూ సత్తా చాటారు. ఊహలు గుసగుసలాడే, జ్యోఅచ్చుతానంద సినిమాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్‌ దర్శకుడిగా తన మూడో చిత్రాన్ని కూడా వారాహి బ్యానర్‌లోనే చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌లో నిఖిల్‌ హీరోగా నటించనున్నారట.

ముందుగా ఈ ప్రాజెక్ట్‌ను నాగశౌర్య హీరోగా తెరకెక్కించాలని భావించినా నాగశౌర్య సొంత సినిమాలతో బిజీ కావటంతో నిఖిల్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నిఖిల్ ప్రస్తుతం తమిళ సూపర్‌హిట్ కనితన్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ముద్ర సినిమాలో నటిస్తున్నాడు. టీఎన్‌ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top