హీరో దర్శకత్వం.. కూతురు హీరోయిన్ | Arjun to direct his daughter iswarya | Sakshi
Sakshi News home page

హీరో దర్శకత్వం.. కూతురు హీరోయిన్

Dec 15 2015 9:25 AM | Updated on Sep 3 2017 2:03 PM

హీరో దర్శకత్వం.. కూతురు హీరోయిన్

హీరో దర్శకత్వం.. కూతురు హీరోయిన్

తండ్రి దర్శకత్వంలో కూతురు కథానాయికగా నటించడం అనేది అరుదైన విషయమే.

తండ్రి దర్శకత్వంలో కూతురు కథానాయికగా నటించడం అనేది అరుదైన విషయమే. యాక్షన్ కింగ్ అనగానే గుర్తొచ్చేది నటుడు అర్జునే. ఆయనలో నటుడే కాకుండా మంచి దర్శకుడు ఉన్నాడన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అర్జున్ కూతురు ఐశ్వర్య ఇంతకు ముందే పట్టత్తు యానై అనే చిత్రంలో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. విశాల్ హీరోగా నటించిన ఆ చిత్రం ఆమెకు ఆశించిన విజయాన్ని అందించలేదు. దీంతో తదుపరి చిత్రంపై ఆచి తూచి అడుగేస్తున్న ఐశ్వర్య అర్జున్ చిన్న గ్యాప్ తరువాత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. విశేషం ఏమిటంటే ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రానికి అర్జున్ దర్శకత్వం వహించనున్నారు.

ఇది తమిళం, కన్నడ భాషలలో తెరకెక్కనుంది. దీని గురించి ఐశ్వర్య తెలుపుతూ తన తొలి చిత్రం పట్టత్తు యానై తరువాత పలు అవకాశాలు వచ్చినా మంచి కథా పాత్ర కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు తన తండ్రి దర్శకత్వం వహిస్తున్న ద్విభాషా చిత్రంలో నటించనున్నట్లు వెల్లడించారు. ఇది ప్రేమ కథా చిత్రంగా ఉంటుందన్నారు. కన్నడ నటుడు చేతన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తనపాత్ర చాలా భిన్నంగాను, నూతనంగాను ఉంటుందన్నారు. చిత్రాన్ని ఈ నెలాఖరులో ప్రారంభించడానికి సన్నాహాలు చేసినట్లు అయితే తుపాను కారణంగా జనవరికి వాయిదా వేసినట్లు ఐశ్వర్య వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement