నవాజ్‌ కోసమే నటిస్తున్నా

Anurag Kashyap all set for cameo in Nawazuddin Siddiqui film Bole Chudiyan - Sakshi

దర్శకుడిగా హిందీలో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసీపూర్, దేవ్‌ డి, మన్‌మర్జియా’ వంటి సూపర్‌హిట్‌ సినిమాలను అందించారు అనురాగ్‌ కశ్యప్‌. 2017లో యాక్టర్‌గా ‘ఇమైక్క నొడిగళ్‌’ అనే తమిళ చిత్రంలో నటించారు. తాజాగా నవాజుద్దీన్‌ సిద్ధిఖీ హీరోగా రూపొందుతున్న ‘బోలే చుడియా’లోనూ యాక్ట్‌ చేయనున్నారట. ఈ సినిమా ద్వారా నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తమ్ముడు నవాబ్‌ సిద్దిఖీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాలో నటించడం గురించి అనురాగ్‌ కశ్యప్‌ మాట్లాడుతూ – ‘‘నన్ను ఇప్పటివరకూ నవాజుద్దీన్‌ ఏదీ అడగలేదు. తొలిసారి ఈ సినిమాలో యాక్ట్‌ చేయమని అడిగారు. అందుకే చేస్తున్నాను’’ అన్నారు. అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వంలో నవాజుద్దీన్‌ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసీపూర్, రమన్‌ రాఘవన్‌’ సినిమాల్లో నటించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top