డిసెంబర్‌ 14న ‘అనగనగా ఓ ప్రేమకథ’

Anaganaga O Prema Katha Release Date - Sakshi

విరాజ్‌ జె అశ్విన్‌ను హీరోగా పరిచయం చేస్తూ థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం అనగనగా ఓ ప్రేమకథ. ప్రతాప్‌ తాతంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రిద్ధి కుమార్‌, రాధా బంగారులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ ఫైనాన్షియర్‌ కె.ఎల్‌.యన్‌ రాజు ఈ సినిమాకు నిర్మాత.

ఇటీవల సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకొని క్లీన్ యు సర్టిఫికేట్ పొందిన ఈ సినిమాను డిసెంబర్‌ 14న రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత కెఎల్‌యన్‌ రాజు, దర్శకుడు ప్రతాప్‌, హీరో విరాజ్‌, ఎడిటర్ మార్తాండ్‌ కె వెంకటేష్‌, సినిమాటోగ్రాఫర్‌ రాజు, నటుడు కాశీ విశ్వనాథ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు ప్రతాప్‌.. తనకు దర్శకుడిగా తొలి అవకావం ఇచ్చిన నిర్మాత కెఎల్‌ఎన్‌ రాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సినిమా ఓ అందమైన ప్రేమకథ అని సినిమాకు ‘టచ్‌ హ్యాజ్‌ ఏ మెమరీ’ అన్న ట్యాగ్‌ లైన్‌ ఎందుకు పెట్టామో సినిమా చూస్తే మీకు అర్థమవుతుందని తెలిపారు. హీరో విరాజ్ మాట్లాడుతూ.. సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నామని అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకముందన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top