ధనిక కుర్రాడి పేద జీవితం!

Allu Sirish in Telugu remake of Malayalam film ABCD - Sakshi

ధనిక కుటుంబానికి చెందిన ఓ కుర్రాడు పేద జీవితం గడపాల్సి వచ్చింది. ఎందుకు అంటే మలయాళ ఏబీసీడీ (అమెరికన్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ) సినిమాలో చూపించారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో ‘ఏబీసీడీ’ పేరుతోనే రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రంలో ‘అల్లు’ శిరీష్‌ హీరోగా నటిస్తున్నారు. ‘కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్‌ రుక్సార్‌ థిల్లాన్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంతో సంజీవ్‌రెడ్డి దర్శకునిగా పరిచయం కానున్నారు.

‘మధుర’ శ్రీధర్, యష్‌ రంగినేని నిర్మిస్తున్నారు. ధీరజ్‌ మొగిలినేని సహ–నిర్మాత. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘అల్లు శిరీష్‌ హీరోగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. బాలనటుడిగా పేరు తెచ్చుకున్న మాస్టర్‌ భరత్‌ ఈ సినిమాలో హీరో ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్ట్‌లో మార్పులు చేశాం. జుధా సాంధీ మంచి çస్వరాలు అందిస్తున్నారు’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top