అమెరికన్‌ ఛానల్‌లో బన్నీ ప్రమోషన్స్‌ | Allu Arjun Promoting Naa Peru Surya in HBO | Sakshi
Sakshi News home page

May 1 2018 11:20 AM | Updated on May 1 2018 2:06 PM

Allu Arjun Promoting Naa Peru Surya in HBO - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. లగడపాటి శ్రీధర్‌, నాగబాబు సంయుక్తం నిర్మిస్తున్న ఈ సినిమా మే 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను అమెరికన్‌ టీవీ ఛానల్‌ హెచ్‌బీఓలో ప్రారంభించారు చిత్రయూనిట్. హాలీవుడ్‌ ప్రీమియర్‌ లీగ్‌ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో కనిపించిన బన్నీ కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో పాటు మే 4న రిలీజ్‌ అవుతున్న నా పేరు సూర్య చూడాలంటూ కోరారు. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా అర్జున్‌, శరత్‌ కుమార్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement