బర్త్‌డేకి టైటిల్‌?

allu arjun new movie title launch postponed due to corona virus - Sakshi

‘ఆర్య’(2004), ‘ఆర్య 2’ (2009) చిత్రాల తర్వాత దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీమూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా ఈ సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. ఈ నెల 8న అల్లు అర్జున్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘శేషాచలం’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తను చిత్రబృందం ఖండించింది. మరి.. టైటిల్‌ ఏంటో తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top