
అజిత్
సౌత్‌లో అజిత్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అజిత్‌తో కలిసి ఒకే ఫొటోలో బందీ అయిపోవాలని అభిమానులు కోరుకుంటారు. అజిత్ వీరాభిమాని ఒకరు అలానే అనుకున్నారు. అభిమాన హీరో ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాడని తెలుసుకుని, అక్కడికి వెళ్లిపోయాడు. ఓ ఫొటో దిగాలని ప్రయత్నం చేశాడు. కుదరలేదు. ఇంతకుముందు కూడా నాలుగైదుసార్లు ఆ అభిమాని అజిత్‌తో ఫొటో దిగాలని ట్రై చేసినా వీలుపడలేదట.
ఈసారి ఎలాగైనా అజిత్‌తో ఫొటో దిగాలనుకున్నాడట ఆ అభిమాని. అంతే.. ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్న అజిత్ కారును దాదాపు 18 కిలోమీటర్లు ఫాలో అయ్యాడు. ఇది గమనించిన అజిత్ కారు దిగి ఆ అభిమానితో ఫొటోకు పోజు ఇచ్చారు. ఆ తర్వాత ‘‘మరోసారి ఇలా చేయవద్దు. ఫొటో కోసం నన్ను ఫాలో అవ్వడం నాకు ఇష్టం లేదు. నాకోసం ఫొటో దిగడానికి వస్తున్నప్పుడు నీకు ఏమైనా జరిగితే నేను బాధపడతాను. అందుకే నన్నే కాదు.. ప్లీజ్.. ఎవరినీ ఇలా ఫాలో అవ్వొద్దు’’ అని అభిమానికి చెప్పారట అజిత్.