‘ఈ నేలను జీవితాంతం గుర్తుపెట్టుకుంటా’

Aishwarya Rai Says She Never Forgot Tamil Industry - Sakshi

సాక్షి, చెన్నై : తమిళ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆలయాలు, మహోన్నతుల ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని మాజీ ప్రపంచ సుందరి, హీరోయిన్‌ ఐశ్వర్యారాయ్‌ అన్నారు. తాను తెరంగేట్రం చేసింది కోలీవుడ్‌లోనేనని, తనకు గౌరవం తెచ్చిన తమిళ నేలకు వందనం చేస్తున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. చాలాకాలం తర్వాత ఐశ్వర్య బుధవారం చెన్నైకి వచ్చారు. ఈ సందర్భంగా చెన్నై, తమిళ సంప్రదాయాలు, కోలీవుడ్‌ గురించి మాట్లాడారు. ‘ఇక్కడి వాతావరణం, ఆహారపు అలవాట్లు, ప్రేమ, ఆప్యాయత, నేను తిరిగిన నేలను జీవితాంతం గుర్తుంచుకుంటా’ అని చెప్పుకొచ్చారు.

కాగా 1994లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న ఐశ్వర్యా రాయ్‌.. టాప్‌ డైరెక్టర్‌ మణిరత్నం సినిమా ‘ఇద్దరు’తో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అనంతరం బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీ స్టేటస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇక హీరో అభిషేక్‌ బచ్చన్‌తో పెళ్లి తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న ఐశ్‌... తన తదుపరి సినిమాలో నెగెటివ్‌ రోల్‌లో కనిపించనున్నారు. 10వ శతాబ్ధానికి చెందిన కథతో మణిరత్నం తెరకెక్కిస్తున్న సినిమాలో రాజ్యాధికారం కోసం కుట్రలు చేసే నందిని అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు. విక్రమ్‌, శింబు, జయం రవిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో అమలాపాల్‌ కీలక పాత్రలో నటించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top