రూట్‌ మారింది

Aishwarya Rai Bachchan says she wants to direct a film soon - Sakshi

నటిగా తానేంటో నిరూపించుకున్నారు అందాల సుందరి ఐశ్వర్యారాయ్‌. ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ప్రొడక్షన్, డైరెక్షన్‌ విభాగాల్లో సత్తా చాటాలని ప్రయత్నాలు మొదలుపెట్టారట ఐశ్వర్య. ‘‘ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నాను. చాలా రకాల పాత్రలు చేశాను. ఇప్పుడు ప్రొడక్షన్‌ వైపు ఆలోచన మొదలైంది. ఈ విషయంపై సీరియస్‌గా వర్క్‌ చేస్తున్నాం. అలాగే డైరెక్టర్‌ కావాలని ఉంది. భవిష్యత్తులో తప్పకుండా డైరెక్టర్‌ అవుతాను. నా సన్నిహితులు, స్నేహితులు ‘నువ్వు ప్రొడ్యూసర్‌ లేదా డైరెక్టర్‌ అవొచ్చు కదా’ అని అప్పుడప్పుడు సరదాగా ఆట పట్టిస్తుంటారు. ఇప్పుడు వారి మాటలను నిజం చేయాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు ఐశ్వర్యారాయ్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top