అధర్వతో అలీషా
ఇతర రంగాల్లో ప్రాచుర్యం పొందిన వారు సినిమా రంగంపై ఆసక్తి చూపడం అనేది కొత్తేమీ కాదు. డాక్టర్లు, ఇంజనీర్లు, క్రికెట్ క్రీడాకారులు
ఇతర రంగాల్లో ప్రాచుర్యం పొందిన వారు సినిమా రంగంపై ఆసక్తి చూపడం అనేది కొత్తేమీ కాదు. డాక్టర్లు, ఇంజనీర్లు, క్రికెట్ క్రీడాకారులు ఈ రంగంలోకి ప్రవేశించినట్లే బైక్‌రేస్ క్రీడాకారిణి సినీ తెరంగేట్రం చేశారు. యాక్షన్ చిత్రాల హీరోయిన్ మాదిరిగా ఉండే బైక్‌రేస్ క్రీడాకారిణి అలీషాకు ఆ క్రీడను ఫ్యాషన్‌గా భావించే నటుడు అజిత్ సరసన నటించాలనే కోరిక ఉందట. అయితే ప్రస్తుతానికి ఆ కోరిక నెరవేరకపోయినా యువ నటుడు అధర్వతో కలసి నటించే అవకాశం వచ్చింది.
ఈ అవకాశంపై మొదట ఆసక్తి చూపకపోయినా తన వృత్తికి సంబంధించిన పాత్ర కావడంతో అలీషా ఓకే చెప్పారట. అధర్వ హీరోగా నటిస్తున్న ఇరుంబు కుదిరై చిత్రంలో అలీషా ఒక బ్రహ్మాండమైన పోరాట సన్నివేశంలో నటించారు. అదే విధంగా సూపర్ బైక్ ఛేజింగ్ సన్నివేశంలోను నటించి దుమ్ము లేపారు. ఈ సన్నివేశాలకు దర్శక, నిర్మాతలు మొదట డూప్‌ను పెట్టి చిత్రీకరించాలని అనుకున్నా ఆ తరువాత బైక్‌రేస్ క్రీడాకారిణే నటింప చేస్తే బాగుంటుందని భావించారట. ఈ సన్నివేశాలు ఇరుంబు కుదిరై చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తాయంటోంది చిత్ర యూనిట్.